‘నేను రెడీ’ అన్న పవన్.. ‘ఓజీ 2’కు బిగ్ అప్‌డేట్ !

  • గంభీర రిటర్న్స్.. .
  • పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే!
  • సీక్వెల్ పనులు స్టార్ట్!
  • పవన్ డైలాగ్‌తో షేక్ అవుతున్న సోషల్ మీడియా!

ఆంధ్ర‌ప్ర‌భ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ సినిమాపై మరో ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాకు సీక్వెల్ పనులు కూడా ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. రెండో భాగానికి “ఓజస్ గంభీర – రాంపేజ్ బిగిన్స్” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ భారీ ప్రాజెక్టును పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి భాగంపై భారీ అంచనాలు ఉండటంతో, సీక్వెల్‌ను మరింత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఈ సినిమా కథ తొలి భాగానికి ముందు జరిగిన సంఘటనల నేపథ్యంలో సాగే ప్రీక్వెల్‌గా ఉండొచ్చని సమాచారం.

ఇదిలా ఉండగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభమైనట్లు చిత్రబృందం తాజాగా ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. “గంభీర కథ సిద్ధమవుతోంది.. తుపాను రావడానికి ముందు నిశ్శబ్దం ఉంటుంది” అనే సందేశంతో విడుదల చేసిన ఈ వీడియో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

ఇందులో దర్శకుడు సుజీత్‌తో కథపై చర్చిస్తున్న పవన్ కళ్యాణ్, “నేను రెడీ..” అని చెప్పిన సన్నివేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను మరింత ఉత్సాహపరుస్తోంది.