may20ipl | నేడు ముంబై, కోల్కతా ఢీ
may20ipl | నేడు ముంబై, కోల్కతా ఢీ
may20ipl | ఈడెన్ గార్డెన్లో మ్యాచ్
రాత్రి 7.30గంటలకు స్టార్ట్
రెండు జట్లకు ప్లేఆఫ్స్ ఆశల్లేవు
పరువు కోసమే పోటీ
కోల్కతా 12 మ్యాచ్ల్లో 5 గెలుపు
ముంబై 12 మ్యాచ్ల్లో 4 గెలుపు
may20ipl | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ నామమాత్రపు మ్యాచ్ జరగనుంది. బుధవారం కోల్కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి. రెండు జట్ల మధ్య మ్యాచ్ కోల్కతా వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. రెండు జట్లు ఇప్పటికే ప్లేఆఫ్ ఆశలు వదులుకున్నాయి. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండటంతో ఈ మ్యాచ్ గెలిచినా పెద్ద ఉపయోగం ఉండదు. దీంతో ఈ మ్యాచ్ పై అభిమానులు పెద్దగా ఆసక్తి చూపండం లేదు. కానీ పరువు కోసం ఇరు జట్లు గెలవాలని ప్రయత్నిస్తాయి.
కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకూ పన్నెండు మ్యాచ్ లు ఆడి ఐదు మ్యాచ్ లలో గెలిచి ఆరు మ్యాచ్ లలో ఓడింది. ఒక మ్యాచ్ రద్దు కావడంతో పదకొండు పాయింట్లతో ఉంది. ముంబయి ఇండియన్స్ జట్టు పన్నెండు మ్యాచ్లు ఆడి నాలుగు మ్యాచ్లలో గెలిచి కేవలం ఎనిమిది పాయింట్లతోనే ఉంది. దీంతో ఈ జట్ల మధ్య పోటీ నామమాత్రమే. కానీ చివరి విజయం కోసం రెండు జట్లు శ్రమిస్తాయన్నది మాత్రం వాస్తవం.
