ycp | మంత్రి టీజీ భరత్ ఫిర్యాదుతో…

ycp | మంత్రి టీజీ భరత్ ఫిర్యాదుతో…
ycp | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : నంద్యాల జిల్లాకు చెందిన వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇటీవల కర్నూలు కలెక్టరేట్ వద్ద వైసీపీ నేతలు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న బైరెడ్డి సిద్దార్థరెడ్డి.. మంత్రి టీజీ భరత్‌ను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ ఫార్మా కంపెనీ నుంచి మంత్రి రూ.45 కోట్లు లంచం తీసుకున్నారని బహిరంగంగా ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి టీజీ భరత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో పాటు కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా అవమానించారని పేర్కొన్నారు. బైరెడ్డి సిద్దార్థరెడ్డిపై పరువు నష్టం దావా కూడా వేస్తానని మంత్రి స్పష్టం చేశారు.
