మరోసారి ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా
మరోసారి ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా
10 వార్డు అభ్యర్థి పనాస రాజు
క్యాతనపల్లి, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికలలో బాగంగా కాంగ్రెస్ పార్టీ 10వ,వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పనాస రాజు ఆదివారం వార్డులోని గడప గడపకు,వార్డు ప్రజల సహకారంతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వార్డు అభివృద్ధిలో గతంలో చేసిన పనులకు సంబంధించి ఎక్కువ నిధులను తీసుకొచ్చి ఇంకా ఎక్కువ అభివృద్ధిచేసి మున్సిపల్ లోని 10 వ వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొట్టసుధాకర్,కార్యకర్తలు,వార్డు ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
