కాంగ్రెస్ అభ్యర్థి కట్ట సురేష్ గుప్తా కు ఓటు వేయండి- అభివృద్ధికి అండగా నిలవండి

కాంగ్రెస్ అభ్యర్థి కట్ట సురేష్ గుప్తా కు ఓటు వేయండి- అభివృద్ధికి అండగా నిలవండి

ఇంటింటి ప్రచారంలో ఆర్యవైశ్య మహిళలు
కట్ట సురేష్ కుమార్ గుప్తాకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న ఆర్యవైశ్య మహిళలు

మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కట్టా సురేష్ కుమార్ గుప్తా హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి మక్తల్ అభివృద్ధికి అండగా నిలవాలని ఆర్యవైశ్య మహిళలు విజ్ఞప్తి చేశారు. ఆదివారం 1వ వార్డు పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి కట్టా సురేష్ కుమార్ గుప్తాకు మద్దతుగా ఆర్యవైశ్య మహిళలు యువకులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించడమే కాకుండా మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే చేపట్టబోయే పనులను వివరించారు.

వద్దలకోట్ల రూపాయల నిధులతో మక్తల్ పట్టణాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో మున్సిపల్ పాలకవర్గం పట్టణంలోని 16 వార్డుల్లో పెద్ద ఎత్తున సిసి రోడ్లు మురుగు కాలువలు నిర్మాణం చేపట్టడమే కాకుండా శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందని వివరించారు. మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్ పట్టణం పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అభివృద్ధి చేయించుకునే బాధ్యత పట్టణ ప్రజలపై ఉందన్నారు .అధికార పార్టీ తప్ప ప్రతిపక్ష పార్టీల వల్ల అభివృద్ధి చేయడం సాధ్యం కాదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. అభివృద్ధికి అడ్డు కాలు వేయడం కారు కూతలు కోయడం తప్ప ప్రతిపక్ష పార్టీలు సాధించేది ఏదీ ఉండదన్నారు.మక్తల్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించాలని విన్నవించారు . ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో 1వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కట్ట సురేష్ కుమార్ గుప్తాకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి మున్సిపల్ లో అధికారాన్ని కట్టబెట్టాలని ఈ సందర్భంగా వారు విన్నవించారు .ఈ కార్యక్రమంలో కట్టా ఉషారాణి తో పాటు ఆర్యవైశ్య మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .

Leave a Reply