3-Member-Committee : రంగంలోకి కేంద్ర కమిటీ Andhra Prabha Spl News
3-Member-Committee : రంగంలోకి కేంద్ర కమిటీ Andhra Prabha Spl News
- విశాఖకు చేరిక.. పరిస్థితిలపై సమీక్ష
- స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై విచారణ
( ఆంధ్రప్రభ, విశాఖపట్నం బ్యూరో!
3-Member-Committee : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై విచారణకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నియమించిన త్రీ మెన్ కమిటీ రంగంలోకి దిగింది. బొకారో సెయిల్ డైరెక్టర్ ఇన్ చార్జి ప్రియారంజన్, సెయిల్ సీజీఎం జితేంద్ర కుమార్, సెయిల్ మాజీ సీజీఎం గోపాల్ సింగ్ ఈ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారు. బొకారో నుండి త్రీ మెన్ కమిటీ సభ్యులు విశాఖపట్నం చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం 4.30కి విశాఖ స్టీల్ ప్లాంట్‌లో త్రీ మెన్ కమిటీతో భేటీ కానున్న కేంద్ర ఉక్కు భారీపరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. ప్రమాదానికి గల కారణాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై కమిటీ సభ్యులతో కేంద్ర ఉక్కు, భారీపరిశ్రమల శాఖ సహాయమంత్రి శ్రీనివాస వర్మ సమీక్షిస్తారు.
