Basara Tragedy | గోదావరిలో ముగ్గురు అన్నదమ్ములు గల్లంతు

Basara Tragedy | గోదావరిలో ముగ్గురు అన్నదమ్ములు గల్లంతు

Basara Tragedy | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసరలో విషాద ఘటన చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి దిగిన ముగ్గురు అన్నదమ్ములు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని చంద్రశేఖర్, రాంచందర్, మల్లేష్ గా గుర్తించారు. వీరంతా హైదరాబాద్‌లోని కాచిగూడ ప్రాంతానికి చెందిన వారుగా అధికారులు తెలిపారు.

స్నానానికి దిగిన సమయంలో ప్రమాదవశాత్తూ లోతైన నీటిలోకి వెళ్లడంతో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు యువకుల ఆచూకీ కోసం గోదావరిలో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.