హైదరాబాద్: అంతర్జాతీయ సంస్థ విమానంలో ప్రయాణిస్తున్న మహిళ ఆకస్మికంగా గుండెపోటుకు గురయ్యారు.. ఫ్లైట్ అటెండెంట్ గుర్తించి వెంటనే సమాచారాన్ని పైలెట్ కు అందించారు. దీంతో అత్యవసర ల్యాండింగ్ కోసం శంషాబాద్ విమానాశ్రయ అధికారులను పైలెట్ అభ్యర్ధించారు.అనుమతి రావడంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అక్కడే సిద్ధంగా ఉన్న అంబులెన్స్ లో ఎయిర్ పోర్టులోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహిళ మృతిచెందింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
Samsahabad | విమానంలో మహిళకు గుండెపోటు.. శంషాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
