చోరీ కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో జరిగిన ఇంటి చోరీ కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. టౌన్ ఎస్‌ఐ కె. నరేష్ తెలిపిన వివరాల ప్రకారం, హనుమాన్‌నగర్‌కు చెందిన రాయిని రమాదేవి, అర్జున్ దంపతులు మే 27న ఇంటికి తాళం వేసి సుల్తానాబాద్‌కు వెళ్లారు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న దుండగుడు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న 5 గ్రాముల బంగారు చెవి కమ్మలు, 10 గ్రాముల బరువున్న రెండు బంగారు ఉంగరాలు, ఒక జత వెండి కాళ్ల పట్టీలను అపహరించాడు.
బాధితుల ఫిర్యాదు మేరకు మే 30న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం భూమ్‌నగర్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న పెద్దపల్లి శాంతినగర్‌కు చెందిన మిర్యాల రంజిత్‌రెడ్డి (25)ను అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీ చేసినట్లు అంగీకరించినట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
