వేమూరి వెంకట ప్రసాద్ సేవలు ప్రశంసనీయం…

వేమూరి వెంకట ప్రసాద్ సేవలు ప్రశంసనీయం…

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రచారంలో కీలకపాత్ర…
మీడియా సమన్వయంలో చురుకైన పాత్ర…
డిఐపిఆర్‌వో కె.వి.రమణరావు.

విజయవాడ, ఆంధ్రప్రభ : సమాచార, పౌర సంబంధాల శాఖలో 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ సేవలందించిన ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడంతో పాటు మీడియా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవడంలో చురుకైన పాత్ర వహించి ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు మీడియా ప్రతినిధుల ప్రసంశలను అందుకున్న వేమూరి వెంకట ప్రసాద్ సమాచార శాఖకు అందించిన సేవలు ఆదర్శప్రయంగా నిలుస్తాయని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.వి. రమణరావు అన్నారు.

ఎవిసూపర్ వైజర్‌గా పనిచేస్తూ గురువారం పదవీ విరమణ చేసిన వి.వి.ప్రసాద్ దంపతులను ప్రభుత్వ అతిథిగృహ ఆవరణలో గల డీఐపీఆరవో కార్యాలయంలో అభినందన సభ నిర్వహించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారి కె.వి. రమణరావు మాట్లాడుతూ 1995 సంవత్సరం సమాచార పౌర సంబంధాల శాఖ ఏలూరు కార్యాలయంలో సినీ అపరేటర్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన వి.వి. ప్రసాద్ 1997 బదిలీపై విజయవాడ కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు.

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచి సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవడంలో సమాచార శాఖ కీలకపాత్ర వహిస్తుందన్నారు. ప్రభుత్వ శాఖల్లో అత్యంత కీలకమైన సమాచార శాఖలో విధులు నిర్వర్తించడం చాలా ఒత్తిడితో కూడుకున్నదన్నారు. 30 ఏళ్లకు పైగా విజయవాడలోని కార్యాలయాల్లో సమర్థవంతమైన అలుపెరగని సేవలందిస్తూ ప్రజా ప్రతినిధులు అధికారులు మీడియా ప్రతినిధుల మన్ననలను పొందరన్నారు.

వి.వి.ప్రసాద్ ప్రతిభ నేటితరం ఉద్యోగులు స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన అవసరముందన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన వి.వి.ప్రసాద్ సేవలను గుర్తిస్తూ కృష్ణా ఎన్‌టిఆర్ జిల్లాలో పనిచేసిన కలెక్టర్ల నుండి ప్రసంశ పత్రాలను అభినందనలను అందుకున్నారన్నారు. విఐపిలు, వి.వి.ఐపిల పర్యటనలు, పుష్కరాలు, దసరా ఉత్సవాలు, ప్రత్యేక కార్యక్రమాల సందర్భలలో మీడియా ప్రతినిధులను సమన్వయ పరచుకోవడంలో తనదైన ముద్ర వేసుకున్నారన్నారు.

పదవీ విరమణ ప్రతి ఒక్కరికి తప్పనప్పటికి వివి ప్రసాద్ సమాచార శాఖ నుండి పదవీ విరమణ పొందడం తీరని లోటని ఆయన సేవలను భవిష్యత్తులో సమాచార శాఖ వినియోగించుకుంటుందని అన్నారు. ఏపిఎన్‌జిజివో అసోసియేషన్ డి. సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అత్యంత కీలకమైన సమాచార శాఖలో నిజాయితీ కర్తవ్యనిష్టతో అమఎవిసూపర్ వైజర్‌గా పనిచేస్తూ గురువారం పదవీ విరమణ చేసిన వి.వి.ప్రసాద్ దంపతులను ప్రభుత్వ అతిథిగృహ ఆవరణలో గల డీఐపీఆరవో కార్యాలయంలో అభినందన సభ నిర్వహించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారి కె.వి. రమణరావు మాట్లాడుతూ 1995 సంవత్సరం సమాచార పౌర సంబంధాల శాఖ ఏలూరు కార్యాలయంలో సినీ అపరేటర్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన వి.వి. ప్రసాద్ పై విజయవాడ కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు.

ల్యమైన సేవలందించడంతో పాటు ఏపిఎన్‌జిజివో అసోసియేషన్ నాయకుడిగా ఉద్యోగ సమస్యలను పరిష్కరించడంలో నిబద్దతతో పనిచేశారన్నారు. ఉద్యోగ సంఘ నాయుకుడిగా వివి ప్రసాద్ అందించిన సేవలు సంఘ అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయని ఆయన సేవలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

అనంతరం సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ ఎల్ స్వర్ణలత, జాయింట్ డైరెక్టర్లు పి కిరణ్ కుమార్ ఎస్ సూర్యచంద్రరావు డిప్యూటీ డైరెక్టర్ రామాంజనేయులు, తదితరులు వివి ప్రసాద్ దంపతులను అభినందించారు. సమాచార శాఖ సంయుక్త సంచాలకురాలు టి. కస్తూరి, ఆరఐఇ సి.వి. కృష్ణారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ తిమ్మప్ప, ఎం బాస్కరనారాయణ, అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.వి. మోహన్‌రావు, ఏపిఎన్‌జిజివో జిల్లా కార్యదర్శి పి. రమేష్ నగర అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్. సివి.ఆర్ ప్రసాద్, షేక్ నజీర్‌హుద్దీన్ జిల్లా నగర శాఖల కార్యవర్గ సభ్యులు సమాచార శాఖ జోన్`2, కార్యాలయం సహాయ సంచాలకుల కార్యాలయం డిఐపిఆర్‌వో కార్యాలయం సిబ్బంది ప్రభుత్వ అతిధి గృహం ఆవరణంలోని వివిధ శాఖలకు చెందిన కార్యాలయల అధికారుల సిబ్బంది వి.వి. ప్రసాద్ దంపతులను ఘనంగా సత్కరించారు.

Leave a Reply