వడదెబ్బతో ఉపాధి కూలీ మహిళ మృతి…

దెందులూరు, ఆంధ్రప్రభ : ఉపాధి హామీ పథకం పనికి వెళ్లి వచ్చిన అనంతరం వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురైన మాగంటి విజయలక్ష్మి మంగళవారం మృతి చెందారు. దెందులూరు గ్రామానికి చెందిన విజయలక్ష్మి ప్రతిరోజూ మాదిరిగానే ఉపాధి హామీ పనులకు వెళ్లారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇంటికి వచ్చిన తర్వాత వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

కుటుంబ సభ్యులు వెంటనే దెందులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే విజయలక్ష్మి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.ఈ ఘటనపై వైద్యులు మాట్లాడుతూ. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో పని చేయవద్దని, తరచూ నీళ్లు తాగుతూ ఉండాలని, తలకు టోపీ లేదా గుడ్డ కట్టుకోవాలని వైద్యులు సూచించారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి తీసుకురావాలని కోరారు.

Leave a Reply