జూబ్లీహిల్స్ లో మందు బంద్ !!

  • మ‌ద్యం అమ్మ‌కాలు నిషేధం

హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో డ్రై డేస్ అమలు చేయనున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి తెలిపారు. జూబ్లీహిల్స్‌ పరిధిలోని సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్ ప‌రిధిలో ఉన్న అన్ని వైన్‌ షాపులు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు, స్టార్‌ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్‌ క్లబ్బులు నవంబర్‌ 9న సాయంత్రం 6 గంటల నుండి నవంబర్‌ 11న సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని ఆదేశించారు. నవంబర్‌ 14న కౌంటింగ్‌ జరిగే రోజున ఉదయం 6 గంటల నుండి కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు, రీ-పోలింగ్‌ జరిగితే ఆ రోజున కూడా డ్రై డే అమలు ఉంటుందని పేర్కొన్నారు.