whatsapp-war : కొలికపూడి కొలవరీ..! Andhra Prabha Top News
whatsapp-war : కొలికపూడి కొలవరీ..! Andhra Prabha Top News
- మట్టి మాఫియాపై వాట్సాప్ వార్
- అక్రమ మైరింగ్ లారీల వీడియో విడుదల
- తనదైన శైలిలో వ్యంగ్యంగా మాటల తూటాలు
- తిరువూరులో మళ్లీ హాట్ టాఫిక్
( తిరువూరు ఆంధ్రప్రభ)

whatsapp-war : తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. మట్టి మాఫియాపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, భారీ లారీల్లో మట్టి తరలిస్తున్నట్లు కనిపించే వీడియోలను తన వాట్సాప్ స్టేటస్‌లో పోస్టు చేశారు. అనంతరం తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
whatsapp-war : మట్టి లారీలతో వాట్సాప్ స్టేటస్

తిరువూరులో మట్టి అక్రమ రవాణాపై మరోసారి రాజకీయ చర్చ మొదలైంది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన వాట్సాప్ స్టేటస్‌లో భారీ లారీల్లో మట్టి తరలిస్తున్న వీడియోలను పోస్టు చేస్తూ, అక్రమ మట్టి తవ్వకాలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. తన స్టేటస్‌లో, “ఎంసెట్ పేపర్ లీక్ చేసి జైలుకు వెళ్లి వచ్చి, హైదరాబాద్‌లో కంపెనీ పేరు మార్చి, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పాత్రధారిగా ఉండి తప్పించుకుని తిరుగుతున్న వాళ్లకు పుట్రేలలో మట్టి మాఫియా నడపడం పెద్ద కష్టమా?” అంటూ వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు, వీడియోలు తిరువూరు రాజకీయ వర్గాలతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృత వైరల్ అవుతూ చర్చకు దారితీశాయి. ఇప్పటికే కొన్నిసార్లు బెల్ట్ షాపులు రేషన్ మాఫియా అక్రమ ఇసుక తరలింపు తో పాటు మట్టి తరలింపు పై కూడా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.
