సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం..

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దేశ ప్రతిష్టాత్మక రక్షణ ప్రాజెక్టు అయిన అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) డిఫెన్స్ ప్రాజెక్టును ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) – డీఆర్‌డీఓ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో శుక్రవారం పుట్టపర్తి విమానాశ్రయంలో విశేష సందడి నెలకొంది.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి అక్కడ ఘన స్వాగతం లభించింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పుష్పగుచ్ఛాలు అందించి ఆత్మీయంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, టీజీ భరత్, శ్రీమతి ఎస్. సవిత, సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, హిందూపురం, అనంతపురం ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పల్లె సింధూరరెడ్డి, ఎంఎస్ రాజు, కందికుంట వెంకట ప్రసాద్, అమిలినేని సురేంద్రబాబు, గుమ్మనూరు జయరాం, దగ్గుపాటి ప్రసాద్, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తదితరులు హాజరయ్యారు. అంతకుముందు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

Leave a Reply