అధిక ఆదాయాన్ని ఇచ్చేది ఉద్యాన పంటలే: హెచ్.ఓ దివ్య
అధిక ఆదాయాన్ని ఇచ్చేది ఉద్యాన పంటలే: హెచ్.ఓ దివ్య
రాప్తాడు, ఆంధ్రప్రభ : రైతులు పండ్ల తోటలు పెట్టుకోవడం వలన కూలీల ఖర్చు అధిక శ్రమ తగ్గడంతోపాటు ఆదాయం పెరుగుతుందని రాప్తాడు ఆత్మకూరు ఉద్యాన శాఖ అధికారి కె.దివ్య పేర్కొన్నారు. శనివారం రాప్తాడు మండల పరిధిలోని జి.కొత్తపల్లి గాండ్లపర్తి గ్రామాలలో మామిడి డ్రాగన్ ఫ్రూట్ దానిమ్మ అరటి పంటలను రాప్తాడు హెచ్ఈఓ శ్రీనివాసులతో కలిసి పరిశీలించారు.ఈ సంధర్భంగా మాట్లాడుతూ మామిడి దానిమ్మ అరటి పంటలకు హెక్టరు కు రూ.50,000 సబ్సిడీ బొప్పాయి పంటకు 2 సం.లకు రూ.24,000 ఫారం ఫండ్ 20×20 ప్రకారం లోపల 3 మీటర్లు లోతు ఏర్పాటు చేసుకుంటే రూ.90,000 సబ్సిడీ కర్బూజా కళింగర పంటలకు డ్రాప్ కవర్ కొరకు హెక్టారు కు రూ.10,000 సబ్సిడీ అల్లనేరేడు ఉసిరి పంటలకు హెక్టరు కు రూ.30,000 సబ్సిడీ ఎస్సీ ఎస్టీ రైతులకు మల్చింగ్ సీట్ కు సబ్సిడీ అలాగే ఉచితంగా డ్రిప్ స్పింకర్లు మరియు వెదురు (బొంగు)మునగ పంటలకు కూడా అధిక శాతం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు.
మార్కెటింగ్ సదుపాయం కూడా ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు.
తోటలోని ప్యాక్ హౌస్ కి కూడా సబ్సిడీ ఇస్తున్నామన్నారు.పండ్ల తోటలు పెట్టడం వలన కూలీల ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రైతులు కె.లక్ష్మీనారాయణ జి.ముత్యాలమ్మ చంద్రశేఖర్ రంగయ్య హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు.
