Drunk Driving | తల్లి మృతి, కుమారుడికి తీవ్రగాయాలు
Drunk Driving | తల్లి మృతి, కుమారుడికి తీవ్రగాయాలు
Drunk Driving |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బహదూర్‌పల్లి గ్రామం ప్రధాన రహదారిపై ఇవాళ ఉదయం విషాదకర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో బొలెరో వాహనం నడిపిన డ్రైవర్ బైక్‌పై వెళ్తున్న తల్లీకొడుకును వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఉదయ్ లతారెడ్డి (49) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు వేదాంత్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. కన్న కొడుకు కళ్ల ముందే తల్లి మృతి చెందడంతో ఘటన స్థానికులను కలిచివేసింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వేదాంత్‌ను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బొలెరో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
