gold-rate-today-huge-fall-buy-gold-or-wait-telugu వరుసగా పడిపోతున్న బంగారం ధరలు.. ఇకపై ధరల దిశ ఎలా ఉండొచ్చు?
gold-rate-today-huge-fall-buy-gold-or-wait-telugu వరుసగా పడిపోతున్న బంగారం ధరలు.. ఇకపై ధరల దిశ ఎలా ఉండొచ్చు?
బంగారం ధరలు తగ్గుదల వెనుక అసలు కారణాలివే
హైదరాబాద్‌లో బంగారం ధరల విశ్లేషణ.. 10 రోజుల్లో ఎంత తగ్గింది?
రెండు రోజుల్లో రూ.3,820 తగ్గిన 24 క్యారెట్ల బంగారం.. ఇంకా తగ్గే అవకాశముందా?
బంగారం కొనాలా.. వేచి చూడాలా? నిపుణులు ఏమంటున్నారు?
వారంలో 5% పతనం.. నెల రోజుల్లో రూ.16 వేలకుపైగా తగ్గిన బంగారం
బంగారం ధరలకు భారీ బ్రేక్.. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వరుస పతనం

gold-rate-today-huge-fall-buy-gold-or-wait-telugu | ఆంధ్రప్రభ వెబ్, బిజినెస్ : బంగారం ధరలు బాగా దిగొస్తున్నాయి. దేశీయ మార్కెట్‌లో ఒక శాతం, అంతర్జాతీయ మార్కెట్‌లో 1.5 శాతం మేరకు ధర పడిపోయింది. కొనుగోలుదారులకు నిజాంగా ఇది సువర్ణ అవకాశమే. కానీ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధర పది గ్రాములు రూ.1.20 లక్షలకు పడిపోయే అవకాశం ఉందని అంచానలు ఉన్నాయి. దీంతో కొనుగోలు విషయంలో ఆచీతూచీ ముందడుగు వేస్తున్నారు.
మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందన్న అంచనాలు బలపడటంతో బులియన్ మార్కెట్‌పై ఆ ప్రభావం చూపుతుంది. దీనివల్ల బంగారం ధరలు పడిపోవచ్చు అన్న అంచనాలు ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్ (31.10 గ్రాములు) కు 1.5 శాతం పడిపోయి 3,956.92 డాలర్లకు చేరింది. జూన్ నెలలోనే బంగారం ధరలు 12.7 శాతం క్షీణించడంతో, ఇది 2008 అక్టోబర్ తర్వాత నెలవారీగా నమోదైన అతిపెద్ద పతనమని నిపుణులు చెబుతున్నారు.
ధరలు ఎందుకు పడుతున్నాయి?
ఇరాన్‌కు సంబంధించిన ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు మరింత పెరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు బలపడడం వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగే సమయంలో బంగారంపై పెట్టుబడుల ఆకర్షణ తగ్గే అవకాశం ఉండటంతో ధరలు బలహీనపడుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
దేశీయ మార్కెట్లో…
దేశంలో బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.3820 మేర తగ్గింది. గత వారం రోజులుగా బంగారం ధరలు తేడాలు చోటు చేసుకున్నాయి. పసిడి విలువ 5 శాతానికి పైగా క్షీణించింది. ఈ ధరల తగ్గుదలతో అధిక ధరల కారణంగా కొనుగోళ్లు వాయిదా వేసుకున్న ఆభరణాల కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు కొంత ఊరట లభించింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ పతనం
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 4,000 డాలర్ల దిగువకు పడిపోయింది. గత నాలుగు నెలల్లో ఇదే కనిష్ఠ స్థాయి. జూన్ నెలలోనే స్పాట్ గోల్డ్ ధరలు 12 శాతానికి పైగా పడిపోయాయి.

ఈ రోజు (జూన్ 30) ధరలు
జాతీయ మార్కెట్లో…
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) – రూ.1,40,130 (రూ.1,800 తగ్గుదల)
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) – రూ.1,28,450 (రూ.1,650 తగ్గుదల)
అంతర్జాతీయ మార్కెట్లో
స్పాట్ గోల్డ్ – ఔన్స్ (31.10 గ్రాములు) కు 3,984.82 డాలర్లు (0.97% తగ్గుదల)
స్పాట్ సిల్వర్ – ఔన్స్‌కు 57.45 డాలర్లు (1.24% తగ్గుదల)
కొనుగోలుదారులకు అనుకూల సమయమే…
ఇటీవల ధరల తగ్గుదలతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కానీ అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, అమెరికా వడ్డీ రేట్ల నిర్ణయాలు, డాలర్ కదలికలు రానున్న రోజుల్లో బంగారం ధరల దిశను నిర్ణయించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగే ఆధారంగా బంగారం ధరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది.
పది రోజుల్లో గ్రాముకు రూ.595 తగ్గిన 24 క్యారెట్ల గోల్డ్
హైదరాబాద్‌లో బంగారం ధరలు గత పది రోజులుగా భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ఒక రోజు పెరుగుదల కనిపిస్తే, మరుసటి రోజు భారీగా తగ్గుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు బంగారం ధరల కదలికలను నిశితంగా గమనిస్తున్నారు.
జూన్ 22న 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,798కు చేరుకోగా, అనంతరం వరుసగా పలు రోజులు తగ్గుతూ వచ్చింది. జూన్ 30 నాటికి గ్రాము ధర రూ.14,013కు చేరింది. అంటే ఎనిమిది రోజుల్లోనే గరిష్ఠ స్థాయి నుంచి గ్రాముకు రూ.785 తగ్గింది. జూన్ 21తో పోలిస్తే కూడా రూ.595 మేర తగ్గుదల నమోదైంది.
అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా జూన్ 22న గ్రాముకు రూ.13,565 ఉండగా, జూన్ 30 నాటికి రూ.12,845కు పడిపోయింది. ఈ కాలంలో గ్రాముకు రూ.720 తగ్గగా, జూన్ 21తో పోలిస్తే రూ.545 తగ్గింది.
గత పది రోజుల ధరల సరళిని పరిశీలిస్తే జూన్ 22, 26, 27 తేదీల్లో మాత్రమే ధరలు పెరిగాయి. మిగతా రోజుల్లో తగ్గుదల లేదా స్థిరత్వం కనిపించింది. ముఖ్యంగా జూన్ 23న 24 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజే గ్రాముకు రూ.338, 22 క్యారెట్ల బంగారం రూ.310 తగ్గడం విశేషం. అలాగే జూన్ 29, 30 తేదీల్లో కూడా వరుసగా తగ్గడంతో మార్కెట్లో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది.
పది రోజుల బంగారం ధరలు ఇలా ఉన్నాయి…

తేదీ 24 క్యారెట్లు (1 గ్రా.) 22 క్యారెట్లు (1 గ్రా.)
30 జూన్ ₹14,013 (↓₹180) ₹12,845 (↓₹165)
29 జూన్ ₹14,193 (↓₹202) ₹13,010 (↓₹185)
28 జూన్ ₹14,395 (మార్పు లేదు) ₹13,195 (మార్పు లేదు)
27 జూన్ ₹14,395 (↑₹120) ₹13,195 (↑₹110)
26 జూన్ ₹14,275 (↑₹142) ₹13,085 (↑₹130)
25 జూన్ ₹14,133 (↓₹158) ₹12,955 (↓₹145)
24 జూన్ ₹14,291 (↓₹169) ₹13,100 (↓₹155)
23 జూన్ ₹14,460 (↓₹338) ₹13,255 (↓₹310)
22 జూన్ ₹14,798 (↑₹190) ₹13,565 (↑₹175)
21 జూన్ ₹14,608 (మార్పు లేదు) ₹13,390 (మార్పు లేదు)
నెల రోజుల్లో ధరల్లో మార్పులు
జూన్ ఒకటో తేదీన 24 క్యారెట్లు బంగారం పది గ్రాములు ₹1,56,220 ఉండగా జూన్ 30 నాటికి ₹1,40,130 లకు పడిపోయింది. జూన్ ఒకటో తేదీన 22 క్యారెట్లు బంగారం పది గ్రాములు ₹1,43,200 ఉండగా జూన్ 30 నాటికి ₹1,28,450 లకు పడిపోయింది.
గమనిక: బంగారం ధరలు రోజువారీగా మారుతుంటాయి. కొనుగోలు చేసే ముందు తాజా ధరలను సంబంధిత జ్యువెలరీ షోరూమ్ లేదా బులియన్ మార్కెట్‌లో నిర్ధారించుకోవడం మంచిది.
