us-iran-doha-talks : ఊ.. అంటే ఊహూ Andhra Prabha Top News

us-iran-doha-talks : ఊ.. అంటే ఊహూ Andhra Prabha Top News

  • దోహాలో భేటీపై
  • అమెరికా సై
  • ఇరాన్​ నై
  • ఇప్పటికే అమెరికా ప్రతినిధులు చేరిక
  • ఈ రోజే నిపుణుల భేటీ
  • ఎలాంటి చర్చలు లేవు.. ఇరాన్​ స్పష్టం

( ఆంధ్రప్రభ, టెహ్రాన్​ ప్రతినిధి )

us-iran-doha-talks : దో హాలో అమెరికా, ఇరాన్​ సాంకేతిక నిపుణుల భేటీ పై.. ఉత్కంఠత నెలకొంది. ఈ సమావేశాన్ని అమెరికా ధృవీకరించగా , అమెరికా ఉన్నతాధికారులు ఖతార్‌కు బయలుదేరారు. ఇరాన్​ మాత్రం ఈ చర్చలను వ్యతిరేకిస్తోంది. , ఈ పరస్పర విరుద్ధ వైఖరితో దోహాలో అధికారిక చర్చలు జరుగుతాయా లేదా అనే అంశంపై సందేహాలను రేకెత్తించాయి. దోహాలో చర్చలపై పరస్పర విరుద్ధ వాదనల నడుమ అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ దోహాకు బయలుదేరారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య ప్రతిపాదిత సమావేశంపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో, అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఖతార్‌లోని దోహాకు బయలుదేరినట్టు అమెరికా అధికారులు తెలిపారు. మంగళవారం దోహాలో అమెరికా, ఇరాన్ అధికారులు సమావేశమవుతారని, ఈ చర్చల కోసం ఇరాన్​ అభ్యర్థించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది.

us-iran-doha-talks : ఎలాంటి చర్చలు లేవు

అమెరికాతో ఎలాంటి చర్చలు లేవని ఇరాన్ ఖండించింది. ఇరుపక్షాల మధ్య చర్చలకు ఎలాంటి ప్రణాళికలు లేవని అధికారులు స్పష్టం చేశారు. దోహాలో అమె రికా ప్రతినిధి బృందం చర్సలతో తమకు సం బంధం లేదని ఇరాన్ పేర్కొంది, ఈ చర్చలను తోసిపుచ్చింది . దోహాలో అమెరికాతో చర్చల వార్తలను ఇరాన్ ఖండించింది. ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం అమలును పర్యవేక్షించడానికే తమ ప్రతినిధి బృందం ఖతార్ పర్యటనకు బయలుదేరినట్టు అమెరికా స్పష్టం చేసింది. ఒప్పందంలోని నిబంధనలు అమలు జరిగేలా చూడటం, ఇరాన్ డిమాండ్లు నెరవేరేలా చూడటమే టెహ్రాన్ తక్షణ ప్రాధాన్యం అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ అన్నారు. అవగాహన ఒప్పందం అమలును పర్యవేక్షించడానికే నిపుణుల బృందం అక్కడికి వెళ్లింది,” అని బఘాయీ తెలిపారు. ఒప్పందంలోని ఆర్టికల్ 10 కింద ఇరాన్ చమురు ఎగుమతులపై అమెరికా మినహాయింపులు జారీ చేసిందని, వాటి అమలును ఇరాన్ పర్యవేక్షిస్తోందని ఆయన పేర్కొన్నారు. అవగాహన ఒప్పందంలోని ఆర్టికల్ 11 కింద స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని కూడా ఇరాన్​ కోరుతోంది. రాబోయే రోజుల్లో అమెరికా పక్షంతో ఏ స్థాయిలోనూ చర్చల సమావేశాలు జరపం. అమెరికా ప్రతినిధులు ఖతార్ పర్యటనకు వెళ్లడానికీ, ఇరాన్ ప్రతినిధి బృందం పర్యటనకూ ఎలాంటి సంబంధం లేదు,” అని బఘాయీ అన్నారు.