గుర్రెవులలో సివిల్ రైట్స్ డే నిర్వహణ..

కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ : మండలంలోని గుర్రెవుల గ్రామంలో మంగళవారం కన్నాయిగూడెం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు వారి పౌర హక్కులు, ప్రభుత్వ సేవలు పొందే విధానం, సమస్యలు ఉంటే ఎక్కడ ఫిర్యాదు చేయాలి, చట్టపరంగా లభించే రక్షణలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉన్నాయని, ఎవరైనా అన్యాయం ఎదుర్కొంటే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ శాఖల సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.