మైనర్ బాలికపై లైంగిక వేధింపులు..

మైనర్ బాలికపై లైంగిక వేధింపులు..

  • యువకుడిపై పోక్సో కేసు

కుంటాల, ఆంధ్రప్రభ : మండలంలోని అందాకూర్ గ్రామానికి చెందిన శ్రీధర్ (25) అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సి. అశోక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అందాకూర్ గ్రామానికి చెందిన శ్రీధర్ బుధవారం అర్ధరాత్రి సమయంలో ఆరుబయట కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తున్న ఓ మైనర్ బాలిక వద్దకు వెళ్లి ఆమె చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడు. దీంతో బాలిక ఒక్కసారిగా కేకలు వేయడంతో పక్కనే నిద్రిస్తున్న ఆమె తల్లి మేలుకొని నిందితుడిని గుర్తించారు.

బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కుంటాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మైనర్ బాలికలపై జరిగే నేరాల విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కేసులో నిందితుడు శ్రీధర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై సి. అశోక్ వెల్లడించారు.

Leave a Reply