Raghava Lawrence | రాజకీయాలపై ఊహాగానాలకు చెక్

Raghava Lawrence | రాజకీయాలపై ఊహాగానాలకు చెక్

సామాజిక సేవ, సినిమాలపైనే ప్రస్తుతం దృష్టి

Raghava Lawrence | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారానికి తెరదిస్తూ, ప్రస్తుతం తన దృష్టి పూర్తిగా సామాజిక సేవ, సినిమా ప్రాజెక్టులపైనే ఉందని వెల్లడించారు.

రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారనే ఊహాగానాలపై స్పందించిన ఆయన, ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తన పూర్తి దృష్టి సామాజిక సేవా కార్యక్రమాలు, సినిమా ప్రాజెక్టులపైనే కేంద్రీకృతమై ఉందని తెలిపారు.

ఉప ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పేర్కొన్న రాఘవ లారెన్స్, అభిమానులు, ప్రజలు వదంతులను నమ్మవద్దని సూచించారు.