hydra | టెలిఫోన్ కాలనీలో హైడ్రా చర్యలు
hydra | టెలిఫోన్ కాలనీలో హైడ్రా చర్యలు
hydra | ఆంధ్రప్రభ, హైదరాబాద్: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్‌లో ఉన్న టెలిఫోన్ కాలనీలో కబ్జాకు గురైన పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు పరిరక్షించారు.
ప్రజా అవసరాల కోసం కేటాయించిన పార్కు స్థలాన్ని ఆక్రమణల నుంచి విముక్తి చేసి, భవిష్యత్తులో మళ్లీ కబ్జాలు జరగకుండా అక్కడ కంచె ఏర్పాటు చేసే పనులు చేపట్టారు.
ఈ చర్యలతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజా స్థలాలను పరిరక్షిస్తూ పార్కును కాపాడిన హైడ్రా అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ఆస్తులను సంరక్షించే చర్యలను ఇదే విధంగా కొనసాగించాలని వారు కోరారు.
