Trump-Warns : గ్యాస్ ధర తగ్టించండి Andhra Prabha Top News
Trump-Warns : గ్యాస్ ధర తగ్టించండి Andhra Prabha Top News
- లేదో.. పెద్ద సమస్య తప్పదు
- రిటైలర్లకు ట్రంప్ వార్నింగ్
( ఆంధ్రప్రభ, వాషింగ్టన్ ప్రతినిధి)
Trump-Warns : చమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో గ్యాసోలిన్ ధరలను తగ్గించాలని ఇంధన రిటైలర్లను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారు. ప్రపంచ చమురు ధరలలో ఇటీవలి తగ్గిందని, దేశవ్యాప్తంగా ఇంధన రిటైలర్లు గ్యాసోలిన్ ధరలను తక్షణమే తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో, ముడి చమురు ధర బ్యారెల్‌కు సుమారు $ 68కి పడిపోయినప్పటికీ గ్యాసోలిన్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని ట్రంప్ అన్నారు. “గ్యాసోలిన్ రిటైలర్లు తమ ధరలను వెంటనే తగ్గించాలి! ప్రస్తుతం చమురు ధర బ్యారెల్‌కు $ 68 వద్ద ఉంది, ఇంకా తగ్గుముఖం పడుతున్న తరుణంలోగ్యాసోలిన్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి,” అని ట్రంప్ రాశారు.
అమెరికా అధ్యక్షుడు రిటైలర్లను అధిక ధరలకు అమ్మవద్దని హెచ్చరించారు, దానిని చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ధరలను తగ్గించడంలో విఫలమైతే “పెద్ద సమస్యలు” ఎదురవుతాయని అన్నారు. “రిటైలర్లు ఈ ప్రకటనకు త్వరగా స్పందించి, ఏది సరైనదో అది చేయాలి, మన గొప్ప అమెరికన్ ప్రజల కోసం మీ ధరను తగ్గించండి. “అధిక ధరలకు అమ్మడం అనేది ఉండదు, అది పూర్తిగా చట్టవిరుద్ధం. రిటైలర్లు ఇది చేయకపోతే, ముందు ముందు పెద్ద సమస్యలు ఎదురవుతాయి,” అని ఆయన జోడించారు.
