Vikarabad జంగం దుర్గయ్య మృతి బాధాకరం.. డాక్టర్ చంద్రశేఖర్
Vikarabad జంగం దుర్గయ్య మృతి బాధాకరం.. డాక్టర్ చంద్రశేఖర్
వికారాబాద్ (Vikarabad), ఆంధ్రప్రభ: మాజీ మంత్రి కేసీఆర్ అభిమానిగా ఉన్న జంగం దుర్గయ్య మృతి బాధాకరమని మన చంద్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
సోమవారం గుండ్లమరపల్లి గ్రామానికి చెందిన జంగం దుర్గయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న డాక్టర్ చంద్రశేఖర్ హుటాహుటిన గ్రామానికి చేరుకుని పార్థివ దేహానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం అందించి, భరోసా కల్పించారు. ఎటువంటి అవసరం ఉన్నా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కార్యకర్తలు, నాయకులు బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
