రాఘవేంద్ర నగర్ లో ఘనంగా సీతారాముల కళ్యాణం…
మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ మేడ్చల్ పట్టణ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితులు శాస్త్ర యుక్తంగా కళ్యాణాన్ని నిర్వహించి, తీర్థ ప్రసాదాలను పంపించేశారు. కాలనీకి చెందిన పలువురు దంపతులు కళ్యాణం లో పాల్గొన్నారు.
అనంతరం నిర్వహించిన అన్న ప్రసాద వితరణలో పెద్ద ఎత్తున స్థానికులు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా బీ ఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ చామకూర మహేందర్ రెడ్డి కళ్యాణంలో సీతారాములను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు నిర్వాహకులు ఘనంగా స్వాతం పలికి, తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, నర్సింగ్ రావు, శ్రీధర్ రెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
