Vijayawada | వైద్య కళాశాలలో దరఖాస్తులు ఆహ్వానం..

Vijayawada | వైద్య కళాశాలలో దరఖాస్తులు ఆహ్వానం..

Vijayawada, ఆంధ్రప్రభ : ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల(ఎస్ఎంసీ), ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లలో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు తెలిపారు. అందులో భాగంగా ఎస్ఎంసీలో 20, జీజీహెచ్లో 4 పోస్టులకు గాను అర్హత గల అభ్యర్థులు ఈ నెల 22 నుంచి 31 తేదీ సాయంత్రం 5 గంటల వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.

ఎస్ఎం సీలో ఎంఎస్ఓ -2, ఎఫ్ఎన్ఆ-5, స్టెచ్చర్ బేరర్స్ -5, జనరల్ డ్యూటీ అటెండెంట్స్ -6, నర్సింగ్ ఆర్డెల్లీ -2 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలి పారు. జీజీహెచ్లో ఎంఎన్టీ-3, స్టెచ్చర్ బేరర్ -1 పోస్టు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆయా పోస్టులకు విద్యార్హతలు, ఇతర వివరాలు, దరఖాస్తు ఫారమ్లను కూడా వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చునని ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలరావు తెలిపారు.

Leave a Reply