Andhra pradesh | యువతకు స్ఫూర్తి..

Andhra pradesh | యువతకు స్ఫూర్తి..

Andhra pradesh, ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థకు గర్వకారణమైన చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. రాష్ట్ర క్రీడలు, యువజన సేవల విభాగం ఉన్నతాధికారి భరణి జనవరి 20వ తేదీ ఉదయం 10 గంటలకు 6,962 మీటర్ల ఎత్తులో ఉన్న ఆకోంకాగ్వా పర్వత శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. ఈ శిఖరం దక్షిణ అమెరికాలోనే అత్యంత ఎత్తైనదిగా, ఆసియా ఖండం వెలుపల ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న పర్వత శిఖరంగా గుర్తింపు పొందింది. ఇది అర్జెంటీనా దేశంలోని ఆండీస్ పర్వత శ్రేణిలో ఉంది. క్రీడా రంగంలో ఉన్నతాధికారి హోదాలో ఆకోంకాగ్వా శిఖరాన్ని అధిరోహించిన తొలి అధికారిగా భరణి చరిత్ర సృష్టించారు.

ఈ అసాధారణ విజయంతో ఆమె తన దృఢసంకల్పం, ధైర్యం, నాయకత్వ లక్షణాలను మరోసారి నిరూపించారు. ఈ ఘనత రాష్ట్రంలోని క్రీడాకారులు, యువతకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ విజయం ద్వారా ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగానికి అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు లభించిందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రానికి, క్రీడా ప్రాధికార సంస్థకు గౌరవం తీసుకొచ్చిన భరణికి పలువురు అభినందనలు తెలిపారు.

Leave a Reply