జొన్నవిత్తులకు జలధీశ్వరాలయ కమిటీ సన్మానం
జొన్నవిత్తులకు జలధీశ్వరాలయ కమిటీ సన్మానం
ఘంటసాల: ప్రముఖ సినీ గేయ రచయిత, సుప్రసిద్ధ తెలుగు కవి జొన్నవిత్తుల రామలింగశాస్త్రి శుక్రవారం ఘన సన్మానం అందుకున్నారు. “దివి వైభవం” పేరుతో దివిసీమ శతకం రచించి దివిసీమ ఖ్యాతిని విశ్వవ్యాప్తి చేయటంతో పాటు, తద్వారా ఘంటసాల జలధీశ్వరాలయ చరిత్ర విశ్వరంజకం చేసిన జొన్నవిత్తుల వారికి మండల పరిధిలోని తాడేపల్లి మలయాళ స్వామి ఆశ్రమంలో ఘంటసాల శ్రీ జలధీశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ మూల్పూరి వెంకటరావు -సావిత్రి దంపతులు, మలయాళ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి, జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మెన్ గొర్రెపాటి వెంకట రామకృష్ణ, అసంగానంద గిరిస్వామి, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ఆధ్యాత్మిక గురువు విజ్ఞాన స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.
