ప్రతిభకు ప్రత్యేక వేదిక.. విద్యార్థులకు ఘన సత్కారం
వికారాబాద్, ఆంధ్రప్రభ : పదవ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వీరశైవ విద్యార్థులకు వికారాబాద్ వీరశైవ యువదళ్ ఆధ్వర్యంలో ఆదివారం ఎస్ఎస్సీ ప్రతిభా పురస్కారాలు అందజేశారు.
వికారాబాద్ పట్టణంలోని ముద్దమల్లప్ప తోటలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వీరశైవ సమాజం గౌరవ అధ్యక్షులు డాక్టర్ ముద్ద భక్తవత్సలం, ప్రముఖ అర్చకులు మఠం శివకుమార్, శ్రీ జగజ్యోతి బసవేశ్వర విద్యాసంస్థ సొసైటీ అధ్యక్షులు బసవరాజ్ పటేల్, మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్, వీరశైవ సమాజం మాజీ అధ్యక్షులు విజయ్ అప్ప, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా క్యూ న్యూస్ ప్రతినిధి జాక వెంకటేష్, ప్రముఖ వ్యాపారవేత్త గొల్లెన్ అమర్నాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వికారాబాద్ వీరశైవ సమాజం అధ్యక్షులు వీరేశం, కార్యవర్గ సభ్యులతో కలిసి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహిస్తున్న వీరశైవ యువదళ్ అధ్యక్షులు కోటిలింగం, కార్యవర్గ సభ్యులు సుధీర్ పటేల్, భాను చందర్, వసంత్, శివానందం, గుండుమల్ల కిషోర్, హరీష్, కార్తీక్, సంతోష్ తదితరులను వీరశైవ సమాజం పెద్దలు, సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.
