మోమిన్ పేట్, మార్చి 25 (ఆంధ్రప్రభ): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన మోమిన్ పేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని మొరంగపల్లి గ్రామ సమీపంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
బంట్వారం మండలం రొంపల్లి గ్రామానికి చెందిన బైకాని నరేష్ (24) మంగలి సన్నీ (22) వీరిరువురు ప్రాణ స్నేహితులు. అవసర నిమిత్తం మోమిన్ పేట్ కు వచ్చి తిరిగి వారి ద్విచక్ర వాహనం పై స్వగ్రామానికి వెళుతుండగా మొరంగపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఇద్దరి యువకుల మృతి పట్ల రొంపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.