కొత్తగాడి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా ర్యాలీ

  • ర్యాలీని ప్రారంభించిన ట్రైనీ కలెక్టర్ బసవరాజ్

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగాడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ జనాభా అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీని ట్రైనీ కలెక్టర్ బసవరాజ్ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నేతృత్వంలో వైద్య, ఆరోగ్య సిబ్బంది, గ్రామస్తులు ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ బసవరాజ్ మాట్లాడుతూ.. జనాభా నియంత్రణ, కుటుంబ సంక్షేమంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది అందించే సూచనలు, సలహాలను ప్రజలు పాటించాలని కోరారు.

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్యశాఖ నిరంతరం చర్యలు చేపడుతోందన్నారు. వ్యాధుల నివారణ, అవసరమైన మందుల అందుబాటు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైద్యులు, డిప్యూటీ డెమో శ్రీనివాసులు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.