యూరియా యాప్ మాకొద్దు… పాత పద్ధతి కావాలి

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా యాప్ తీసుకోవడం పై తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందని తీవ్ర ఆవేదనతో సొసైటీ గోదామును ముట్టడించారు. భీమ్‌గల్ మండలంలోని జగిర్యాల్ గ్రామంలో ఆదివారం సొసైటీ గోధమును మూసివేసి యూరియా యాప్ ద్వారా యూరియా తీసుకోవడం రైతులకు తీరని నష్టాన్ని కలిగిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు ఆగ్రహించి గోదాన్ని మూసివేసి వెంటనే యూరియా యాప్ ని రద్దు చేయాలని కోరడం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం యూరియా యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల రోడ్లపై వచ్చి రైతుల యొక్క నిరసనలు తెలియజేస్తామని రైతులు గ్రామ ప్రజలు ప్రభుత్వానికి హెచ్చరించారు.

Leave a Reply