అభివృద్ధి పనుల్లో పురోగతి కనిపించాలి..

అభివృద్ధి పనుల్లో పురోగతి కనిపించాలి..

  • ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

మంథని, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని మాటల ప్రభుత్వం కాదని మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు. ఆదివారం మంథని మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో పురోగతి కనిపించాలని అధికారులను ఆదేశించారు. మంథని సుందరీకరణ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి కావాలని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు కోరుకునే అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, సత్వరం పూర్తయ్యేలా కార్యచరణ చేపట్టాలని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

పాఠశాలలో ప్రారంభమవుతున్న వేళ పాఠశాలలో పెండింగ్ పనులు తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల డ్రైనేజీని దారి మళ్ళించి వెంటనే పనులు ప్రారంభించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని వివరించారు. ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య దేయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు మారుపాక నిహారిక, జంబోజు శ్రీమతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి సలహాదారులు, న్యాయవాది శశిభూషణ్ కాచే, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, నాయకులు మంథని సత్యం, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.