Sports | విజేతలకు బహుమతులు ప్రధానం

Sports | విజేతలకు బహుమతులు ప్రధానం
Sports | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : ఈనెల 21 నుండి 23 వరకు జడ్పిహెచ్ఎస్ కమ్మర్ పల్లి (మినీ స్టేడియం) లో జరిగిన 69వ స్కూల్ గేమ్స్ రాష్ట్ర సాప్ట్ బాల్ అండర్ 17 బాల,బాలికల పోటీలలో ఈ రోజరు విజేతలకు కమ్మర్ పల్లి ఏఎంసీ చైర్మన్ పాలేపు నర్సయ్య బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఓటమి, గెలుపులు సమానమని ఓడినవారు కుంగిపోకుండా, గెలిచినవారు పొంగి పోకుండా క్రీడాకారులు ముందుకు సాగాలని అన్నారు.
కమ్మర్ పల్లి లో ఈ క్రీడలు నిర్వహించడం చాలా సంతోష దాయకమని మునుముందు జాతీయ క్రీడలని నిర్వహిస్తామని, అందుకు మా సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన అన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఎన్ వి హనుమంత్ రెడ్డి విచ్చేసి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆత్మ విశ్వాసంతో ఆడాలనీ, నెగిటివ్ థాట్స్ ఉండకుండా మంచి ఆలోచనలతోనే ముందుకు వెళితే కచ్చితంగా విజయం వరిస్తుంది అన్నారు.

అనంతరం సాఫ్ట్ బాల్ బాలుర విభాగంలో ప్రథమ స్థానం నిజామాబాద్,ద్వితీయ స్థానం వరంగల్,తృతీయ స్థానం అదిలాబాద్ విజేతలకు బహుమతులు అందజేశారు. బాలికల విభాగంలో ప్రథమ స్థానం నిజామాబాద్, ద్వితీయ స్థానం మెదక్, తృతీయ స్థానం మహబూబ్నగర్, జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగమణి మాట్లాడుతూ ఈ టోర్నీలో ఎంపికైన క్రీడాకారులు ఫిబ్రవరి 4 నుండి 9 వరకు ఛత్తీస్గడ్ రాష్ట్రం బిలాస్పూర్ లో జరిగే 69 వ జాతీయ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగమణి, ప్రధానోపాధ్యాయులు పి సాయన్న, ఎంపిడిఓ రాజా శ్రీనివాస్, మండల విద్యాధికారి ఆంధ్రయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకేట రవి, విడిసి అధ్యక్షులు భోగ రామస్వామి, స్టేట్ అబ్జర్వర్స్ నాగరాజు, వీరేశం, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ వి నాగభూషణం, సాఫ్ బాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి ఎం సుజాత, చిప్ప నవీన్,వ్యాయమ ఉపాధ్యాయులు రమేష్ , స్వప్న , దేవ సుకన్య, వీణ, జోష్ణ, నరేష్, హెచ్ అనికేత్, ప్రీతి, సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు విక్రమ్, సీనియర్ సాఫ్ట్ బాల్ క్రీడాకారుడు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
