రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

వికారాబాద్, ఆంధ్రప్రభ: వికారాబాద్ రైల్వే జీఆర్పీ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. తాండూరు రైల్వే స్టేషన్ సమీపంలోని కొడంగల్ ఆర్అండ్బీ బ్రిడ్జి వద్ద రైలు ప్రయాణంలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి కిందపడి మృతి చెందాడు.వికారాబాద్ రైల్వే జీఆర్పీ ఎస్ఐ హరిప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. సుమారు 42 నుంచి 45 ఏళ్ల వయస్సు గల ఓ వ్యక్తి రైలు నుంచి జారిపడి రైల్వే ట్రాక్ పక్కన పడిపోయాడు. తీవ్ర గాయాలవ్వడంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లభించకపోవడంతో ఆచూకీ లభ్యం కాలేదు. మృతుడు పింక్ కలర్ షర్టు, బూడిద రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. మెడలో ఆకుపచ్చ రంగు తావీదు, చేతికి కుంకుమ మరియు పసుపు రంగు దారం కట్టుకొని ఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply