పేదల సంక్షేమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం – దాసరి శ్రీహరి గౌడ్

పేదల సంక్షేమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం – దాసరి శ్రీహరి గౌడ్
చిట్యాల, ఆంధ్రప్రభ: ప్రజా పాలన ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పనిచేస్తుందని భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిదాసరి శ్రీహరి గౌడ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాల ప్రభుత్వం, విద్యా, వైద్యం, వ్యవసాయం పలు సంక్షేమ పథకాల కోసం పనిచేస్తుందన్నారు. నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ గృహాలు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 సబ్సిడీపై గ్యాస్, రుణమాఫీ, తదితర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు.
ప్రజాపాలన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి ఇంటింటికి తీసుకు వెళ్తామని ఆయన అన్నారు. భూపాలపల్లి జిల్లా కార్యదర్శిగా తన నియమకానికి అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ కు శ్రీహరి గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
