మృతుల కుటుంబాలకు రూ. ఏడు లక్షల ఎక్స్ గ్రేషియా
మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
చేవెళ్ల, ఆంధ్రప్రభ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం, ఖానాపూర్ స్టేజి సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద మృతులకు కుటుంబాలకు రూ. ఏడు లక్షల రూపాయల ఎక్స్ గ్రేసియా చెల్లించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 5ల క్షలు, ఆర్టీసీ రూ.2 లక్షల ఎక్స గ్రేషియా కలిపి మొత్తం ఏడు లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు చేవెళ్ళే బస్సు ప్రమాద బాధితులకు పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో ఆయన పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి పై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
బస్సు ప్రమాద దుర్ఘటన (Bus accident) లో చనిపోయిన మృతదేహాలకు చేవెళ్ళే ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరీక్ష చేసి బంధువులకు అప్పగించాలని జిల్లా కలెక్టర్, డీసీపీ యోగేష్ గౌతమ్ లకు సూచించారు. ఎప్పటికప్పుడు ఆర్టీసీ, పోలీస్ ,వైద్యశాఖ అధికారులు సమన్వయం పనిచేయాలని ఆదేశించారు. ఈ సంఘర్షణలో ప్రభుత్వ చీప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, మనోహర్ రెడ్డి మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

