ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి‌‌ – డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోద

ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి‌‌ – డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోద

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రజలు తమ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చౌటుప్పల్ వైద్య ఆరోగ్యశాఖ డిప్యూటీ డీఎంహెచ్ఓ లక్ష్మీపురం యశోద తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం గ్రామంలో సర్పంచ్ గిర్కటి నిరంజన్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్సీడీ స్క్రీనింగ్, ముక్త్ భారత్ అభియాన్ జనరల్ హెల్త్ చెకప్, ఎక్స్ రే తదితర ఆరోగ్యపరమైన చెకప్ లను గ్రామస్తులు ఉపయోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మీసాల నరసింహ, పంచాయతీ కార్యదర్శి పాల్వాయి రమాదేవి, సిహెచ్ఓ నరసింహారెడ్డి, ఎంపీహెచ్ఈఓ సత్యనారాయణ, మదన్మోహన్, టీఎస్ఎల్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ జయంత్ కుమార్, దేవిక, ఆశాలు పాల్గొన్నారు.

Leave a Reply