రైతులకు నష్టం చేయొద్దు

రైతులకు నష్టం చేయొద్దు

  • దిశా కమిటీ మెంబర్ వడ్ల నందు

వికారాబాద్, ఆంధ్రప్రభ:
ధారూర్ మండలంలోని గట్టేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వికారాబాద్ బీజేపీ అసెంబ్లీ కోఆర్డినేటర్, దిశా కమిటీ మెంబర్ వడ్ల నందు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పండించే ప్రతి క్వింటాలు వడ్ల నుండి 10 కిలోల వరకు తరుగు తీస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ విషయంలో సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రాజ్ నాయక్, మాజీ ఏఎంసీ చైర్మన్ అంజయ్య, మాజీ సర్పంచ్ వెంకటయ్య, సర్పంచ్‌లు ఉపేందర్ యాదవ్, బీర్ల రాజు, సోమ్లా నాయక్, మండల బీజేపీ మాజీ అధ్యక్షులు రమేష్ కుమార్, కృష్ణ, గంగారం శేఖర్, సందీప్ రావు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

Leave a Reply