ఆటో డ్రైవర్లు ఐక్యత క్రమశిక్షణతో వ్యవహరించాలి..

ఆటో డ్రైవర్లు ఐక్యత క్రమశిక్షణతో వ్యవహరించాలి..

  • ఆటో రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తూముల నరేష్

మంచిర్యాల, ఆంధ్రప్రభ : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే ఆటో డ్రైవర్ లక్ష్యం అని ఆటో రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కార్పోరేటర్ తూముల నరేష్ అన్నారు.బుధవారం హాజీపూర్ మండల కేంద్రంలో మండల స్థాయి సమావేశంలో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తో పాటు పాల్గొని ఆటో రిక్షాలకు స్టిక్కర్ లను అందజేశారు.ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల ఐక్యత,క్రమశిక్షణ తో వ్యవహరించాలని ప్రయాణికుల ద్వారానే ఉపాధి పొందుతున్నామని గ్రహించి వారిపట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు ముఖ్యంగా మహిళలు,పాఠశాల పిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

అనంతరం ఎస్సై కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ విధిగా లైసెన్స్ పొందిన అనంతరం వాహనాన్ని నడిపించాలని, వాహనాలకు సరైన ధ్రువపత్రాలను కలిగి అధికార తనిఖీలలో సహకరించాలన్నారు.ఓవర్ స్పీడ్ డ్రైవ్ చేయకుండ సురక్షితమైన ప్రాణాలతో గమ్యస్థానాలకు చేరుకోవాలని అన్నారు.ఈ మధ్యకాలంలో మంచిర్యాల, హాజీపూర్ మండల కేంద్రాలలో మరణించిన ఆటో డ్రైవర్ల ఆత్మలకు శాంతి చేకూరు లాగున మౌనం పాటించి వారికి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.