ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌కు ఘన సన్మానం

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌కు ఘన సన్మానం

కడెం, ఆంధ్రప్రభ : ఇటీవల జిల్లా కాంగ్రెస్ కార్యవర్గం లో చోటు దక్కిన నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) ప్రధాన కార్యదర్శిగా పొద్దుటూరి సతీష్ రెడ్డి జిల్లా కార్యదర్శులు
బుర్ర దేవందర్ గౌడ్ దుర్గం మల్లేష్ లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ని కాంగ్రెస్ నేతలతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు
ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి డిసిసి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించినందుకు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కి మరియు కాంగ్రెస్ అధిష్టానం కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అలాగే జిల్లా లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ నాయకత్వం నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుల తుమ్మల మల్లేష్ యాదవ్ కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బరుపటి రమేష్ వర్మ. కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బొడ్డు గంగన్న.తాటి సంజీవ్ పటేల్. కోల శ్రీనివాస్ కొండాపురం లక్ష్మణ్ . ఒడ్నాల సత్యం. నర్సింగ్ రమేష్. లింబన్న. షేక్ రఫిక్. బబ్లు. పడిగేల రాజు. గాండ్ల శేఖర్ తుమ్మల ప్రతాప్ యాదవ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.