అంగన్వాడీ కేంద్రాల్లోనే ఫ్రీ ప్రైమరీ, పిఎంశ్రీ తరగతులు నిర్వహించాలి

అంగన్వాడీ కేంద్రాల్లోనే ఫ్రీ ప్రైమరీ, పిఎంశ్రీ తరగతులు నిర్వహించాలి

  • సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్.

దండేపల్లి, ఆంధ్రప్రభ : అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఫ్రీ ప్రైమరీ, పిఎంశ్రీ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ బుధవారం దండేపల్లి మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్స్ , హెల్పర్స్ యూనియన్, సీఐటీయుఆధ్వర్యంలో దండేపల్లి తహశీల్దార్ రోహిత్ దేశ్పాండే కు, ఎంఈఓ కార్యాలయాల్లో వేరు వేరుగా వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4,131 కేంద్రాలను తక్షణమే రద్దు చేసి, ఆ తరగతులను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఐసిడిఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా బలోపేతం చేయాలని ఆయన కోరారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ​అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లుకు రూ. 18,000 వేతనం చెల్లించాలి.​ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి.​ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు అందజేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 3,15,000 పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.​అంగన్వాడీ ఉద్యోగులకు పీఎఫ్, ఈపిఎస్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.​అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించి, కనీస మౌలిక వసతులు కల్పించాలని కోరారు.​ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కనికరపు అశోక్, అంగన్వాడీ నాయకులు పద్మ, అనసూయ, విజయశ్రీ, సరిత, శైలజ, లక్ష్మి, సునీత, కమల, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.