అనారోగ్యంతో కోలామ్ గిరిజనుడు మృతి
జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా జై నూర్ మండలంలోని లెండిగూడ గ్రామానికి చెందిన కొలామ్ గిరిజనుడు మడవి శ్యామ్ రావు(48) అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందినట్లు కోలం సంఘ నాయకులు ఆత్రం రాజు ఆత్రం బాపురావు తెలిపారు. శ్యామ్ రావు గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్సలు చేసిన నయం కాలేదని వారు తెలిపారు.
