12వ వేజ్ బోర్డు జేబీసీసీఐ కమిటీ ఏర్పాటుకు పిలుపు

12వ వేజ్ బోర్డు జేబీసీసీఐ కమిటీ ఏర్పాటుకు పిలుపు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా పనిచేస్తున్న బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పంద కాలపరిమితి ముదగుస్తున్నందున కోల్ ఇండియా యజమాన్యం 12వ వేతన సంఘం సమావేశం ఏర్పాటు చేయాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం (బీ ఎం ఎస్ )అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. గురువారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 11 వేతన సంఘం కాల పరిమితి జూన్ నెలలో ఊస్తుందని 12వ వేతన సంఘం జూలై ఒకటో తేదీలోగా ఏర్పాటు చేయాలని ఆయన కో లిండియా యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

వేతన సంఘం కమిటీ ఏర్పాటుకు కూల్ ఇండియా యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం, కమిటీ నిర్మాణానికి ఇప్పటివరకు ఎలాంటిచర్యలుతీసుకోకపోవడం తో కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందన్నారు. ఈ విషయంపై చెర్చించేందుకు అఖిల భారతీయ కథాన్ మజ్జూర్ సంఘ్ బిఎంఎస్ 113వ వర్కింగ్ కమిటీ సమావేశం గత నెల 9, 10వ తేదీల్లో ఒడిశా రాష్ట్రంలోని తాల్చేర్–అంగుల్ ప్రాంతంలో నిర్వహించిన సమావేశంలో అక్రమేకత్వం చర్చించిందన్నారు.

దేశంలో ఉన్న బొగ్గు పరిశ్రమలలో యాజమాన్యాలు కార్మికుల సమస్యల పట్ల నియంతృత్వ, నిర్లక్ష్యధోరణిఅవలంబిస్తున్నాయని ఇందుకు నిరసనగా తమ సంఘం దేశవ్యాప్తంగాకోల్ ఇండియా, సింగరేణి బొగ్గు గనుల్లో ఆందోళనలు చేపడతామని యాదగిరి సత్తయ్య స్పష్టం చేశారు. కోల్ ఇండియా,సింగరేణి యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. 12వ వేతన సంఘం ఏర్పాటు కొరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు, ఓపెన్ కాస్ట్ లు డిపార్ట్మెంట్లలో నిరసన ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్లు యాదగిరి సత్తయ్య వివరించారు.

కార్మికుల సంక్షేమ పథకాలు,సెలవులు (ప్లే డే), పబ్లిక్ హాలిడేలు తదితర అంశాలపై సింగరేణి కోతలు విధించడం సరైంది కాదన్నారు. కార్మికుల వేతన సవరణ సమయంలో కంపెనీ ఆర్థిక పరిస్థితులపై విస్తృతమైన ప్రజెంటేషన్లు ఇస్తున్న యాజమాన్యం, అధికారుల వేతన సవరణ విషయంలో మాత్రం ఏకపక్షంగా ఉదారంగా వ్యవహరిస్తోందని సత్తయ్య విమర్శించారు.

విద్యుత్ సంస్థలు సింగరేణి కి చేల్లించాల్సిన రూ,, 51.14 వేల కోట్లు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..

రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థల నుంచి సింగరేణి సంస్థకు రావలసిన విద్యుత్తు, బొగ్గు బకాయిలు, బొగ్గు బకాయిలు రూ,,.51,149వేల కోట్లు తక్షణమే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థకు తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, నేషనల్ పవర్ కార్పొరేషన్ సంస్థలు, మహారాష్ట్ర స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, తమిళనాడు స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్, టీ ఎస్ పీ సీ సీ తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ ఎలక్ట్రిసిటీ* సంస్థల నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి రావలసిన విద్యుత్తు బొగ్గు బకాయిలు చెల్లించేందుకు యుద్ధప్రతిపతికన చర్యలు తీసుకుని చెల్లించాలని డిమాండ్ చేసినారు.

తద్వారా పరిశ్రమ పరిరక్షణ కార్మికుల ఉద్యోగ, సామాజిక,భద్రత సంస్థ ఆర్థిక పురోగతికి ప్రయోజనం చేకూర్చాలని విజ్ఞప్తి చేసినారు. ఈ సమావేశంలో బిఎమ్ఎస్ సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ కారంపూడి శ్రీనివాసరాజు, ముందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ డొనికెల రమేష్, ఏరియా కార్యదర్శులు గుర్రం ప్రదీప్ కుమార్, ఏరియా కార్యదర్శి, నాతాడి శ్రీధర్ రెడ్డి ఏరియా ఉపాధ్యక్షులు శ్రీరాంపూర్, చెట్టి వీరన్న సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఊరకొండ తిరుపతి కేంద్ర కమిటీ సభ్యులు, కొమ్మ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply