మొక్కజొన్న రైతులకు మద్దతు తెలిపిన టిఆర్ఎస్ శ్రేణులు..

మొక్కజొన్న రైతులకు మద్దతు తెలిపిన టిఆర్ఎస్ శ్రేణులు..
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ నేత మరి జనార్దన్ రెడ్డి టిఆర్ఎస్ నేత నాగం శశిధర్ రెడ్డి నాయకత్వంలో భారీ ఎత్తున నాయకులు, పార్టీ కార్యకర్తలు, శ్రేణులు సందర్శించారు. మొక్కజొన్న రైతులకు మద్దతు తెలిపారు. గత రాత్రి కురిసిన వర్షానికి తడిసిన మొక్కజొన్న కుప్పలను సంచులను పరిశీలించారు. భారీగా ఉన్న వేలాది మొక్కజొన్న సంచులను నిల్వలను పరిశీలించారు.
రైతులతో మరి జనార్దన్ రెడ్డి నాగం శశిధర్ రెడ్డి మాట్లాడారు. రైతుల గోసలు ఆవేదనను అన్యాయాన్ని తమకు జరిగిన ఇబ్బందులను నాగంకు మరి జనార్దన్ రెడ్డికి వివరించారు 15 రోజుల నుండి 20 రోజుల నుండి భారీ ఎత్తున మొక్కజొన్నలు నిల్వలు ఉన్న ఇప్పటి వరకు తరలించలేదని దాదాపుగా లక్ష బ్యాగులు మొక్కజొన్న ఉందని తెలిపారు. వ్యాపారుల మొక్కజొన్నలు మార్కెట్ యార్డ్ లో పోసి అమ్ముకుంటున్నారని రైతుల మొక్కలను అమ్మడం లేదని కొనుగోలు చేయడం లేదని వివరించారు.

తమకు న్యాయం చేయాలని కోరారు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఇప్పటి వరకు ఏ అధికారి ఎమ్మెల్యే సందర్శించలేదని తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డు చైర్మన్ రమణ రావు మొక్కజొన్న సంచులకు టోకెన్లు ఇచ్చి మొక్కలు కొంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలు నింపడం లేదని పరిస్థితి గోరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎండఅనక, వానఅనక కడుపుకు అన్నం లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఈ ప్రభుత్వంలో ఉన్న దరిద్రం ఎప్పుడూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వైఫల్యం చెందిందని రైతులను ఇబ్బందుల పాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తడిసిన ధాన్యాన్ని కుప్పల మీద ఉన్న నీళ్లను చూపించారు. తమకు న్యాయం చేయాలని లారీల ద్వారా నిల్వ ఉన్న ధాన్యాన్ని తరలించాలని రైతులు కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎమ్మెల్యే సంబంధిత అధికారులు, జోక్యం చేసుకొని రైతాంగానికి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
