సర్వేలో ఖచ్చితత్వం పాటించాలి
సర్వేలో ఖచ్చితత్వం పాటించాలి
- ఎన్యూమరేటర్లకు తహసీల్దార్ సైదులు సూచనలు
అచ్చంపేట, ఆంధ్రప్రభ:
అచ్చంపేట మండలంలో కొనసాగుతున్న ఇండ్ల గణన సర్వేను తహసీల్దార్ సైదులు బుధవారం పరిశీలించారు. మండలంలోని లక్ష్మాపురం గ్రామం , చెంచుపలుగు తాండాలో నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ బ్లాక్ (హెచ్ఎల్బి) సర్వే ప్రాంతాలను ఆయన స్వయంగా సందర్శించి, ఎన్యూమరేటర్ల పనితీరును తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. సర్వే ప్రక్రియను అత్యంత క్షుణ్ణంగా నిర్వహించాలని, ప్రతి ఒక్క ఇంటి వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా ఖచ్చితంగా నమోదు చేయాలని ఎన్యూమరేటర్లకు సూచనలు చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఇండ్ల గణన కార్యక్రమాన్ని ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో తహసీల్దార్ వెంట సూపర్‌వైజర్ శివ శ్రీనివాస్, ఎన్యూమరేటర్లు శ్రీలత, వెంకటేష్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది జుబేర్ తదితరులు పాల్గొన్నారు.

