ముగ్గురు చిన్నారులు.. ఒకే డేట్ ఆఫ్ బర్త్.. అరుదైన రికార్డు
ముగ్గురు చిన్నారులు.. ఒకే డేట్ ఆఫ్ బర్త్.. అరుదైన రికార్డు
నర్సంపేట, ఆంధ్రప్రభ: నాలుగేళ్ల వ్యవధిలో ముగ్గురు చిన్నారులు ఒకే తేదీన జన్మించడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ 2026 లో చోటు దక్కించుకున్న సంఘటన నర్సంపేట పట్టణంలో నెలకొంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు దక్కడంతో ఆయా చిన్నారుల తల్లిదండ్రులను నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ లక్ష్మీ రామానంద్, కమిషనర్ కాటం భాస్కర్ తో పాటు టీపీసీీసీ సభ్యుడు పెండెం రామానంద్ ఘనంగా సత్కరించారు. నర్సంపేట పట్టణం శాంతినగర్ లో నివాసం ఉంటున్న చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లికి చెందిన మాజీ సైనికులు చింతకింది శివకృష్ణ – మౌనిక దంపతులకు ముగ్గురు జన్మించారు. మొదటి సంతానం కూతురు అక్షర 2020 జూన్ 3న జన్మించగా, రెండవ సంతానం అర్జున్ 2022 జూన్ 3వ తేదీన, మూడవ సంతానం కుమారుడు ఆదిత్య కూడా 2024 జూన్ 3న జన్మించదంతో ముగ్గురు ఒకే నెల ఒకే తేదీన రెండేళ్ల వ్యవధిలో జన్మించడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2026లో చోటు సంపాదించుకున్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న చింతకింది అక్షర తల్లిదండ్రులను శాలువాతో మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్, మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ శాలువాల తో సత్కరించి శుభాకాంక్ష లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్స్ బీరం భరత్ రెడ్డి, పొన్నాల మనిషా ప్రకాష్, శ్రీరామోజు రోజా రాణి, ఇస్లావత్ రమా గోపి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, 4వ వార్డు అధ్యక్షులు మంచినీళ్ల నాగరాజు, కాంగ్రెస్ పార్టీ యూత్ సభ్యులు కొర్ర రాహుల్, ఉపూల శాలూమ్, దేవోజు హేమంత్, భూక్యా గణేష్, చీకటి శివమణి లు పాల్గొన్నారు.
