ఈ గీతం దేశభక్తిని గుర్తు చేస్తుంది..

ఈ గీతం దేశభక్తిని గుర్తు చేస్తుంది..

నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : వందేమాతరం (Vandemataram) గీతం దేశభక్తిని గుర్తు చేస్తుందని సి.ఐ శివశంకర్ అన్నారు. వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం సహా అన్ని పోలీస్‌ స్టేషన్లలో వందేమాతరం గీతాన్ని గౌరవప్రదంగా ఆలపించారు.

ఈ సందర్భంగా సిఐ శివశంకర్ (CI Sivashankar), ఆర్‌ఐ నరసింహ ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొని దేశభక్తి భావాలతో వందేమాతరం గీతాన్ని ఆలపించారు.అధికారులు మాట్లాడుతూ “వందేమాతరం మన జాతీయ గౌరవానికి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు ప్రతీక” అని పేర్కొన్నారు.జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో కూడా అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు వెంకటేశ్వర్లు, నరేష్, పురుషోత్తం, శివశంకర్, మద్దయ్య, శిరీష, గాయత్రి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply