ఉట్నూరుకు చేరుకున్న మహా సంకల్ప సేవాలాల్ పాదయాత్రకులు

ఉట్నూరుకు చేరుకున్న మహా సంకల్ప సేవాలాల్ పాదయాత్రకులు

ఉట్నూర్, ఆంధ్రప్రభ : శ్రీ సేవాలాల్ మహారాజ్ దీక్షలు స్వీకరించిన బంజారా దీక్షాపరులు దీక్ష భూమి ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో శంకర్ లొద్ది నుండి పౌరదేవి వరకు సేవాలాల్ దీక్ష దారులు మహా సంకల్ప పాదయాత్ర ప్రారంభం…. 19 నుండి 26 తలపెట్టిన మహా సంకల్ప పాదయాత్ర శుక్రవారం ఉట్నూర్ ఎక్స్ రోడ్డుకు చేరుకుంది. పాదయాత్ర చేపట్టిన దీక్ష పనుల కోసం ఎక్స్ రోడ్డు లోని సమీపంలో గల మాజీ ఎంపీ స్వర్గీయ రాథోర్ రమేష్ స్మృతి వనం లో దీక్షపరుల కోసం స్వర్గీయమాజీ ఎంపీ రాతోడ్ రమేష్ తనయుడు బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ టెంట్లు ఏర్పాటు చేసి దీక్ష పాదయాత్రలకు అల్పాహారం ఏర్పాటు చేశారు.

పాదయాత్ర చేస్తున్న సేవాలాల్ దీక్షాపరులు అల్పాహారం తీసుకొని కొన్ని గంటలు సేద తీర్చుకున్నారు. ఆదిలాబాద్ వైపు బయలుదేరారు. ఈరోజు సాయంత్రం ఈశ్వర్ నగర్ లో ఈరోజు సాయంత్రం భోజనం చేసి అక్కడి నుండి సుంకిడికి వెళ్తారని నిర్వాహకులు తెలిపారు. సుంకుడిలో జైనూరు మండలం మాణిక్ గూడ సర్పంచ్ దంపతులు జాదవ్ జాన గణపతి నాయకులు ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో పాల్గొని భోజనం చేసి బయలుదేరుతారని తెలిపారు.

ఈ నెల 26కు పౌరా దేవికి చేరుకొని దీక్షలు శ్రీరామనవమి రోజున విరమిస్తారని ఈ మహా సంకల్ప పాదయాత్రలో 3 వేల వరకు సేవాలాల్ దీక్ష పరులు పాదయాత్రలో పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏడాది బంజారా దీక్షాపరులు పాదయాత్ర కార్యక్రమం భక్తిశ్రద్ధలతో పాదయాత్రలో సేవాలాల్ మహారాజ్ పేరట ఆధ్యాత్మిక పాటలు పాడుతూ చేపడుతున్నారు.

Leave a Reply