కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలి

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని టీడీపీ సీనియర్ నేత జంపాల సీతారామయ్య అన్నారు. కొండపల్లి పట్టణ పరిధిలోని చైతన్య నగర్, ఇందిరా నగర్ ప్రాంతాల్లో మంగళవారం ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. గత ప్రభుత్వంలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్ల నుంచి అభివృద్ధి వైపు పరుగులు తీయిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు కరిమికొండ బాలాజీ, పీఏసీఎస్ చైర్మన్ కోయ నెహ్రూ, ఏఎంసీ డైరెక్టర్ బసవ ఉమామహేశ్వరరావు, మైనార్టీ నాయకుడు అఫ్సర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.